సినీ జీవితం నుండి బయటకు రండి..

Sun,October 13, 2019 09:24 PM


న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను బాలీవుడ్‌తో ముడిపెడుతూ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఆర్ఎస్ ప్రసాద్ సినిమా జీవితం నుంచి బయటకు రావాలని, వాస్తవ పరిస్థితుల నుంచి ఆయన తప్పించుకోలేరని చురకలంటించారు. సినిమాల ద్వారా వచ్చే లాభాలను పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. మంత్రి గారూ సినిమాల నుంచి బయటకు రండి..వాస్తవాన్ని అంగీకరించేందుకు సిగ్గు పడకండ’ని ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. దేశంలో ఆర్థిక మందగమనం లేదని, ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన 3 సినిమాలు మొదటి రోజే రూ 120 కోట్ల వసూళ్లు సాధించడమే దీనికి నిదర్శనమని కేంద్ర మంత్రి ఆర్ ఎస్ ప్రసాద్ ​వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.2324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles