గుండెపోటుతో వేదిక‌పై కుప్ప‌కూలి మృతి చెందిన క‌మెడీయ‌న్

Sun,July 21, 2019 12:07 PM
Comedian Manjunath Naidu collapses and dies on stage

ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు మంజునాథ్‌(36) దుబాయ్‌లోని ఓ హోట‌ల్‌లో ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తుండ‌గా, తీవ్ర గుండెపోటు రావ‌డంతో స్టేజ్‌పైనే కుప్ప‌కులాడు. ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగానే ఆయ‌న అలా చేస్తున్నాడ‌ని ప్రేక్ష‌కులు, నిర్వాహ‌కులు భావించి ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డంలో ఆల‌స్యం చేయ‌డంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధించారు.

అబుదాబిలో జ‌న్మించిన మంజునాథ్ దుబాయ్ లో స్థిర‌ప‌డ్డాడు. ఓ ఈవెంట్‌లో భాగంగా ప‌లు స్టోరీస్ చెబుతూ ప్రేక్ష‌కుల‌ని న‌వ్విస్తున్నాడు. త‌న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ.. ఎలాంటి ఆందోళ‌న‌లు చెందాడో వివ‌రించాడు. త‌న స్టోరీ గురించి వివ‌రిస్తున్న క్ర‌మంలో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. శ్వాస తీసుకోవ‌డం వ‌ల‌న ఇబ్బంది ప‌డ‌డంతో మంజునాథ్ మ‌ర‌ణించి ఉంటాడ‌ని డాక్ట‌ర్స్ పేర్కొన్నారు.

4495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles