బాలీవుడ్ న‌టుడిపై పోలీసుల‌కు ఫిర్యాదు

Sun,April 9, 2017 11:47 AM

న్యూఢిల్లీ: బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్‌పై ఓ వ్య‌క్తి కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. అర్జున్ త‌న‌ను కెమెరాతో కొట్టి గాయ‌ప‌రిచాడ‌ని ఆ వ్య‌క్తి ఫిర్యాదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అయితే మెడిక‌ల్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నామ‌ని, అవి వ‌చ్చిన త‌ర్వాతే ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తామ‌ని చెప్పారు. షోభిత్ అనే వ్య‌క్తి ఈ ఫిర్యాదు చేశాడు. బార్‌లో డ్యాన్స్ చేస్తున్న స‌మ‌యంలో అర్జున్ రాంపాల్‌.. ఓ ఫొటోగ్రాఫర్ చేతిలోని కెమెరాను తీసుకొని విసిరేశాడ‌ని, అది డ్యాన్స్ ఫ్లోర్‌లో ఉన్న త‌న‌కు త‌గిలి త‌ల‌కు గాయ‌మైంద‌ని శోభిత్ పోలీసుల‌కు చెప్పాడు. త‌ల‌కు గాయ‌మై ర‌క్తం కారింది. ఆ త‌ర్వాత ఆదివారం తెల్ల‌వారుఝామున 4 గంట‌ల‌కు అత‌ను ఫోన్ చేసి ఘ‌ట‌న గురించి చెప్పాడు అని ఓ పోలీస్ అధికారి చెప్పాడు.


వెంట‌నే అక్క‌డికి వెళ్లిన పోలీసులు శోభిత్‌ను ద‌గ్గ‌ర్లోనే ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకెళ్లారు. చికిత్స త‌ర్వాత అత‌న్ని డిశ్చార్జ్ చేశారు. అర్జున్ రాంపాల్ డీజే ప్లే చేస్తుండ‌గా ఓ ఫొటోగ్రాఫ‌ర్ ఫొటోలు తీయ‌డం మొద‌లుపెట్టాడు. ప‌దేప‌దే ఫ్లాష్ రావ‌డంపై విసుగు చెందిన రాంపాల్‌.. అత‌ని చేతిలోని కెమెరాను తీసుకొని విసిరేశాడు. అది కాస్తా శోభిత్‌కు త‌గిలిన‌ట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంటనే రాంపాల్ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. న్యూఢిల్లీ రేంజ్ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ ముకేశ్ కుమార్ మీనా.. ఫిర్యాదు వ‌చ్చిన‌ట్లు ధృవీక‌రించారు. దీనిపై న్యాయ‌నిపుణుల స‌ల‌హాలు కూడా తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

1421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles