క్రేజీ కాంబినేష‌న్ సెట్ చేసిన మైత్రి సంస్థ‌

Thu,November 29, 2018 07:38 AM
crazy combination set in tollywood

హ్య‌ట్రిక్ విజ‌యాలు సాధించిన మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ మ‌ధ్య రెండు వ‌రుస ఫ్లాపుల‌ని చ‌వి చూసింది. వ‌చ్చే ఏడాది ఈ సంస్థ నుండి దాదాపు ప‌ది సినిమాల‌కి పైగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. అయితే తాజాగా ఈ సంస్థ ఓ క్రేజీ కాంబినేష‌న్‌ని సెట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. నేచుర‌ల్ స్టార్ నాని, క్రేజీ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో ప్ర‌స్టేజియ‌స్ ప్రాజెక్ట్‌ని నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ స‌న్నాహాలు చేస్తుంద‌ట‌. ఇప్ప‌టికే నానికి సంబంధించిన ఫోటో షూట్ కూడా పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. వ‌చ్చే ఏడాది ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నార‌ని అంటున్నారు. నాని ప్ర‌స్తుతం క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుద‌ల కానుంది.ఈ మూవీ త‌ర్వాత ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

2343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles