స‌ల్మాన్‌కి స్వాగ‌తం ప‌లికిన రామ్ చ‌ర‌ణ్‌

Wed,September 11, 2019 12:02 PM

బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, సోనాక్షిసిన్హా కాంబినేషన్‌లో దబాంగ్ 3 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చుల్‌బుల్ పాండేగా అల‌రించ‌నున్నాడు స‌ల్మాన్‌. డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. స‌ల్మాన్‌కి స‌న్నిహితుడైన రామ్ చ‌ర‌ణ్ త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రెండ్‌కి స్వాగతం ప‌లుకుతూ ట్వీట్ చేశాడు. హండ్రెడ్ డేస్ టూ ద‌బంగ్ 3 అనే హ్యాష్ ట్యాగ్ జ‌త చేసి చిత్ర తెలుగు వ‌ర్షెన్ మోష‌న్ పోస్ట‌ర్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా షేర్ చేశాడు. వీడియోలో స‌ల్మాన్ .. ఆట‌కైన‌, వేట‌కైన రెడీ అని చెప్పే డైలాగ్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. కిచ్చా సుదీప్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ద‌బాంగ్ సిరీస్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ద‌బాంగ్ 3పై కూడా బోలెడ‌న్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. స‌ల్మాన్ చివ‌రిగా భార‌త్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే.


4450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles