బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు సిద్ధ‌మైన 'దండుపాళ్యం 4'

Sat,September 28, 2019 11:09 AM

పూజా గాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై వెంకట్‌ నిర్మించిన దండుపాళ్యం ఘనవిజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వ‌చ్చిన చిత్రాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి. తాజాగా సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా దండుపాళ్యం 4 చిత్రం తెర‌కెక్కుతుంది. కె.టి.నాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ‘దండుపాళ్యం 4’ నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో హింస‌, శృంగారం త‌దిత‌ర అంశాలు ఎక్కుగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. వెంకట్ మూవీ బ్యానర్ పై నిర్మాత వెంకట్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం భువన చంద్ర అందించారు. దండుపాళ్యం ఫ్రాంచైజ్‌లో వ‌స్తున్న దండుపాళ్యం 4 చిత్రం కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.


1837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles