డ‌బ్బింగ్ మొద‌లు పెట్టిన సూప‌ర్ స్టార్

Fri,November 15, 2019 08:19 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గజిని, స్టాలిన్, తుపాకీ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం 'దర్బార్'. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో రజనీకాంత్ పోలీస్ అధికారి అరుణ్ అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో రజనీ స్టైల్, మాస్ అప్పీల్ అందరిని ఆకట్టుకుంది. రజనీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమ‌కూరుస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అయితే తాజాగా ర‌జ‌నీ త‌న పాత్ర‌కి డ‌బ్బింగ్ మొద‌లు పెట్టారు. ర‌జ‌నీ డ‌బ్బింగ్ చెబుతున్న స్టిల్స్ కొన్ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles