ద‌ర్భార్ సినిమా పైర‌సీని ప్ర‌సారం చేసిన టీవీ ఛాన‌ల్‌

Tue,January 14, 2020 08:09 AM

పైర‌సీని తుద‌ముట్టించేందుకు నిర్మాత‌లు ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసిన దానిని అడ్డుకోలేక‌పోతున్నారు. సినిమా రిలీజ్ రోజే పైర‌సీ బ‌య‌ట‌కి రావ‌డం చిత్ర యూనిట్‌ని క‌ల‌వ‌రప‌రుస్తుంది. రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్ న‌టించిన ద‌ర్భార్ చిత్రాన్ని పైర‌సీ చేశారు. అంతేకాదు హెచ్‌డీ వ‌ర్షెన్ లింక్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి, దీనిని అంద‌రికి షేర్ చేయండ‌ని కామెంట్ కూడా పెట్టారు. క‌ట్ చేస్తే శ‌ర‌ణ్య టీవీ ఛాన‌ల్ ద‌ర్భార్ పైర‌సీ ప్రింట్‌ని జ‌న‌వ‌రి 12న మ‌ధురైలో ప్ర‌సారం చేశారు. ఇది చూసిన అభిమానులు షాకై నిర్మాణ సంస్థ‌కి ఫిర్యాదు చేశారు. దీంతో లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ టీవీ యాజ‌మాన్యంపై తీవ్రంగా ఫైర్ కావ‌డంతో పాటు పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది . ద‌ర్భార్ చిత్రం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, జ‌న‌వ‌రి 9న చిత్రాన్ని భారీ స్థాయిలో విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి అంత‌టా భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

1319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles