ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో ద‌ర్భార్ చిత్ర షూటింగ్

Tue,September 17, 2019 01:33 PM

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం ద‌ర్భార్. సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ చిత్రంల‌ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ద‌ర్భార్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో ర‌జ‌నీ డ్యూయ‌ర్ రోల్ పోషిస్తుండ‌గా, ఇందులో ఒకటి పోలీసు అధికారి పాత్రకాగా, మ‌రొక‌టి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు.


ముంబై నేప‌థ్యంలో సాగే చిత్రం ద‌ర్భార్ కాగా, ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ ముంబైలోనే జ‌రుపుతున్నారు. తాజాగా మూవీ చిత్రీక‌ర‌ణ ముంబైలోనే జ‌రుగుతుంది. అక్కడ ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితులున్న‌ప్ప‌టికి చిత్ర షూటింగ్ జ‌రుపుతున్నారు. ఈ విష‌యాన్ని సినిమాటోగ్రాఫ‌ర్ సంతోష్ శివ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో షేర్ చేసి తెలిపాడు. చిత్రంలో యువ‌రాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ , విజ‌య్ సేతుప‌తి ధ‌ర్మ‌దొరైలో న‌టించిన జీవా అనే ట్రాన్స్‌జెండ‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నార‌ట‌. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles