వైసీపీలో చేరిన నటుడు దాసరి అరుణ్ కుమార్

Thu,March 14, 2019 05:44 PM
Dasari arunkumar Joins YSRCP Today


హైదరాబాద్ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నటుడు దాసరి అరుణ్ కుమార్ వైసీపీలో చేరారు. ఇవాళ లోటస్ పాండ్ లోని నివాసంలో అరుణ్ కుమార్ కు వైసీపీ అధినేత జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చడం వల్లే తాను వైసీపీలో చేరానని ఈ సందర్భంగా అరుణ్‌ కుమార్ తెలిపారు. జగన్ ఆదేశిస్తే పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని అరుణ్ కుమార్ తెలిపారు. ఇటీవలే సినీ నటులు అలీ, రాజా రవీంద్ర, జయసుధ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

1227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles