స‌మ్మ‌ర్‌లో సంద‌డి చేయ‌నున్న డియ‌ర్ కామ్రేడ్

Sun,March 3, 2019 08:02 AM
dear commrade release in summer

యూత్‌ఫుల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చివ‌రిగా టాక్సీవాలా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే డియ‌ర్ కామ్రేడ్ చిత్రం భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్‌ పై రూపొందుతుండ‌గా, ఇందులో కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడు విజ‌య్‌. కాకినాడ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ చేస్తుండగా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రం చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతుండ‌గా, మ‌రి కొద్ది రోజుల‌లో షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేయ‌నున్నార‌ట‌. మే 22న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు.

1492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles