క‌రణ్ జోహార్ చేతికి డియ‌ర్ కామ్రేడ్ చిత్రం

Wed,July 24, 2019 09:02 AM
dear comrade remakes in hindi

బాలీవుడ్ బ‌డా ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ సౌత్‌లో రూపొందిన మంచి చిత్రాల‌న్నింటిని రీమేక్ చేసి స‌క్సెస్ సాధిస్తుంటారు. తాజాగా ఆయ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ముందుకు వ‌చ్చారు. విజ‌య్ తో పాటు చిత్ర నిర్మాత‌ల‌తో క‌లిసి చిత్రాన్ని వీక్షించిన ఆయ‌న ఇదొక గొప్ప ప్రేమ క‌థ‌. మంచి సందేశం ఉంది. న‌టీన‌టుల‌తో పాటు నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌పై ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాన‌నే విష‌యం తెల‌ప‌డం ఆనందంగా ఉంది. సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని క‌ర‌ణ్ జోహార్ తెలిపారు. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మిస్తున్నారు. జూలై 26న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

1007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles