మొత్తానికి డియ‌ర్ కామ్రేడ్ నుండి అప్డేట్ వ‌చ్చింది

Fri,March 8, 2019 08:08 AM
Dear Comrade teaser release on march 17

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల‌లో ఎక్కువ క్రేజ్ ఉంది విజ‌య్ దేవ‌ర‌కొండ‌కే అన్న విష‌యం అందరికి తెలిసిందే. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు విజ‌య్. డియ‌ర్ కామ్రేడ్ చిత్రం భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్‌ పై రూపొందుతుండ‌గా, ఇందులో కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడు విజ‌య్‌. కాకినాడ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ న‌టిస్తుండ‌గా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రం చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి కొద్ది రోజుల‌లో షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేయ‌నున్నార‌ట‌.

మే 22న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కి సంబంధించి తాజాగా అప్డేట్ వ‌చ్చింది. మార్చి 17న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి దేశ వ్యాప్తంగా క్రేజ్ రావ‌డంతో మేక‌ర్స్ ఈ ఆలోచ‌న చేసిన‌ట్టు తెలుస్తుంది.

1454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles