నాలుగు భాష‌ల‌లో విడుద‌లైన డియ‌ర్ కామ్రేడ్ టీజ‌ర్

Sun,March 17, 2019 11:14 AM

యూత్‌ఫుల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ క్ర‌మ‌క్ర‌మేపీ పెరుగుతూ పోతుంది. ప్ర‌స్తుతం ఆయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టా తాజా చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌ని సౌత్ ఇండియాకి చెందిన తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. డియ‌ర్ కామ్రేడ్ చిత్రం భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుండ‌గా, ఇందులో కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడు విజ‌య్‌. కాకినాడ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ న‌టిస్తుండ‌గా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. హైద‌రాబాద్‌లో చిత్రం చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి కొద్ది రోజుల‌లో షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేయ‌నున్నార‌ట‌.


మే 31న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కి సంబంధించిన టీజ‌ర్‌ని తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల చేశారు.ఫైటింగ్ స‌న్నివేశంతో టీజ‌ర్ మొద‌లు కాగా, లిప్ లాక్ సీన్‌తో ఎండ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్‌లో వ‌చ్చే సాంగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం ఆనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంకి హీరో అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ 22 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. న్యూ ఢిల్లీలో తొలి షెడ్యూల్ జ‌ర‌పనున్నారు.1854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles