వరుణ్ ధావన్‌ను దీపికా, రణ్‌వీర్ దత్తత తీసుకున్నారట?

Wed,March 13, 2019 09:15 PM

ఎట్టెట్టా.. వరుణ్ ధావన్‌ను దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ దత్తత తీసుకున్నారా? ఇదెలా సాధ్యం. అసలు.. అంత పెద్ద వ్యక్తిని ఎలా దత్తత తీసుకుంటారు. అసలు.. వరుణ్ ధావన్‌ను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారా? పదండి తెలుసుకుందాం.


దీప్‌వీర్ జంట, వరుణ్ దావన్ ఇటీవల లండన్ వెళ్లారట. లండన్ వెళ్లేటప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ముగ్గురు ఎయిర్‌పోర్ట్ కార్ట్ ఎక్కి వెళ్తున్నారట. అప్పుడే వరుణ్ దావన్.. తన ఫోన్ తీసి.. ఏదో టైమ్ పాస్ కోసం ఓ సెల్ఫీ వీడియో తీశాడు. వీడియో తీస్తూ.. నన్ను దత్తత తీసుకున్న పేరెంట్స్ వీళ్లే.. అంటూ చెప్పేసరికి.. రణ్‌వీర్, దీపికా నవ్వు ఆపుకోలేకపోయారట. వెంటనే దీపిక అందుకొని.. అవును.. మేము దత్తత తీసుకున్నాం. అతడు డిన్నర్ చేశాడా లేదా? సరిగ్గా నిద్రపోయాడా లేదా? సరిగ్గా టిఫిన్ తిన్నాడా? లేదా అని మేమే చూసుకుంటున్నాం.. అంటూ దీపికా వీడియోలో చెబుతుండటం.. దానికి రణ్‌వీర్, వరుణ్ నవ్వడం వీడియోలో కనిపిస్తాయి. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

2810
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles