యూఎస్ చెక్కేయ‌నున్న దీపిక‌-ర‌ణ‌వీర్‌, అలియా-ర‌ణ్‌బీర్‌

Sat,March 30, 2019 09:11 AM
Deepika,Ranveer And Alia,Ranbir To Travel Across The US

బాలీవుడ్ స్టార్స్ దీపిక‌-ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా-ర‌ణ్‌బీర్ క‌పూర్ మ‌ధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ఫిలిం ఫేర్ వేడుక‌ల‌లో ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్న దీపిక‌, అలియా, ర‌ణ్‌బీర్‌లు మ‌ధ్య మ‌ధ్య‌లో ముచ్చ‌టించుకోవ‌డం, సంద‌ర్భాన్ని బ‌ట్టి జోకులు వేసుకోవ‌డం చేశారు. అయితే బాలీవుడ్ మీడియా స‌మాచారం ప్ర‌కారం ఈ రెండు జంట‌లు 2020లో యూఎస్ ట్రిప్ వేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. న్యూయార్క్‌, న్యూ జెర్సీ, చికాగోతో పాటు కొన్ని ప‌ర్యాట‌క ప్రాంతాల‌ని ఈ రెండు జంటలు క‌లిసి సంద‌ర్శించ‌నున్న‌ట్టు టాక్. అయితే ఈ లోపు బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్‌లు పెళ్లి పీట‌లు ఎక్కుతార‌ని స‌మాచారం. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో క‌ర‌ణ్ జోహార్.. అలియా, దీపికని ఛాన్స్ వ‌స్తే న‌లుగురు క‌ల‌సి ఏదైన వెకేష‌న్ టూర్‌కి వెళ‌తారా అని ప్ర‌శ్నించ‌గా, వారు పాజిటివ్‌గా స్పందించారు.

2259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles