కంగనా ర‌నౌత్ 'ధాక‌డ్' ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ విడుద‌ల‌

Fri,August 9, 2019 10:55 AM
Dhaakad first look teaser released

బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ రీసెంట్‌గా తెలుగు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన “జడ్జిమెంటల్ హై క్యా” చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో రాజ్ కుమార్ రావ్ హీరోగా న‌టించారు. ఇక అశ్విన్ అయ్యర్ తివారి దర్శకత్వంలో “పంగా” అనే క్రీడా ప్రధాన చిత్రంలో నటించనుంది కంగనా. వీటితో పాటు కంగ‌నా .. ర‌జ‌నీష్ రాజి ఘాయ్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ చిత్రం చేస్తుంది. ధాక‌డ్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంది. ఇటీవ‌ల‌ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కంగ‌నా.. మంట‌ల మ‌ధ్య నిలుచొని రెండు గ‌న్స్ ప‌ట్టుకొని ఉంది. ఈ లుక్‌ని చూస్తుంటే 2001లో ఏంజెలినా జోలి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన‌ టాంబ్ రైడ‌ర్ గుర్తుకొస్తుందని నెటిజ‌న్స్ పేర్కొన్నారు.

తాజాగా ధాక‌డ్ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇందులో కంగనా మార‌ణాయుధాల‌తో షాకింగ్ లుక్‌లో క‌నిపిస్తుంది. యాక్ష‌న్ మూడ్‌లో ఉన్న ఆమెని చూసిన అభిమానులు కంగ‌నా ఈ చిత్రంతో మ‌రింత అల‌రించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. లేడీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తొలి యాక్ష‌న్ ఫిలిం ఇదే కాగా, ఈ సినిమా త‌న కెరీర్‌లో బెంచ్ మార్క్‌గా నిలుస్తుంద‌ని కంగ‌నా భావిస్తుంది . ధాక‌డ్ చిత్రాన్ని సోహైల్ మాక్లాయ్ నిర్మిస్తుండగా,వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. రాజీ ఘాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం విదిత‌మే

846
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles