త‌మిళంలో విడుద‌ల‌కి సిద్ధ‌మైన ధ‌నుష్ హాలీవుడ్ చిత్రం

Tue,May 21, 2019 01:28 PM
Dhanushs Hollywood Film All Set to release in india

ద‌క్షిణాది చిత్ర పరిశ్రమలో న‌టుడిగానే కాక నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగాను స‌త్తా చాటాడు ధ‌నుష్‌. కొన్నేళ్ళ క్రితం బాలీవుడ్‌లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న ఈ విలక్షణ నటుడు ఆ త‌ర్వాత ప‌లు చిత్రాలు చేశాడు. అయితే ఇండియన్ నటీనటులు అనీల్ కపూర్, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, ఓంపురి, సోనూ సూద్, గుల్షన్, ఇర్షాన్, అమైరా దస్తూర్ ఇలా ఇండియన్ నటీనటులంతా అదృష్టం కలిసొచ్చి హాలీవుడ్ మెట్లు ఎక్కారు. ఆ అదృష్టం ధనుష్ కి కూడా ' ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్' అనే రూపంలో వ‌చ్చింది. రొమైన్ ప్యూర్తొలా రాసిన 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్ హూ గాట్ ట్రాప్‌డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్‌' పుస్త‌కం ఆధారంగా కెనడియన్‌ స్క్రిప్ట్‌ రైటర్‌ కమ్‌ డైరెక‍్టర్‌ కెన్‌ స్కాట్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్లు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడారియోలతో ధ‌నుష్‌తో జతకట్టారు. ఎమోష‌న‌ల్ అండ్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఇండియాలో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త‌మిళంలో ఈ చిత్రాన్ని ప‌క్కిరి అనే టైటిల్‌తో విడుద‌ల చేయ‌నున్నారు. జూన్ 21న దేశ వ్యాప్తంగా ఈ మూవీ విడుద‌ల కానుంది.1612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles