మలయాళ సినీ నటుడు దిలీప్.. నటి మంజూ వారియర్ ల వివాహం 1998లో జరిగిన సంగతి తెలిసిందే. వీరికి మీనాక్షి అనే కూతురు కూడా ఉంది. కొన్నాళ్ళు సాఫీగా సాగిన వీరి వివాహ బంధంలో అనుకోని విభేదాలు తలెత్తడంతో 2015 జనవరిలో దీలీప్- మంజూలు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2016 నవంబరులో నటి కావ్యను దిలీప్ వివాహమాడారు. అప్పటి నుండి మంజూ- దిలీప్ విడిపోవడానికి కారణం కావ్య అంటూ పుకార్లు షికారు చేశాయి. ఇంక మీనాక్షికి కావ్య అంటే అస్సలు పడడం లేదని ప్రచారం జరిగింది. కాని తాజాగా వీటన్నింటికి బ్రేక్ వేసాడు దిలీప్. మీనాక్షి బర్త్ డే వేడుకలను దిలీప్, కావ్య దంపతులు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకి దీలిప్- కావ్య ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫోటోలను దిలీప్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. అందులో దిలీప్, కావ్యలతో మీనాక్షి చాలా సాన్నిహిత్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దిలీప్ మాట్లాడుతూ కావ్య , మీనాక్షికి తల్లి మాత్రమే కాదు గొప్ప ఫ్రెండ్ అని కూడా చెప్పాడు. మీనాక్షి చాలా మెచ్యూరిటీ గార్ల్ అని తాను అన్ని పరిస్థితులను అర్ధం చేసుకుంటుందని ఈ మాలయాళీ స్టార్ అన్నాడు. ఏదేమైన రీసెంట్ గా జరిగిన బర్త్ వేడుక అన్ని పుకార్లకు పులిస్టాప్ పెట్టింది.