మ‌హేష్ 27వ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఫిక్స్..!

Wed,August 7, 2019 08:31 AM
director fix for mahesh 27

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ మ‌హ‌ర్షి చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో త‌న 26వ సినిమాని అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. అయితే మ‌హేష్ కోసం ఇప్ప‌టికే ఇప్పటికే రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, కొర‌టాల శివ‌, సందీప్ వంగా, పరుశురామ్ వంటి దర్శకులు లైన్‌లో ఉన్నారని తెలుస్తోండ‌గా, ఏ ద‌ర్శ‌కుడితో త‌ర్వాతి ప్రాజెక్ట్ చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. ప‌ర‌శురాం త‌ప్ప మిగ‌తా ద‌ర్శ‌కులు అంతా వేరే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో మ‌హేష్ త‌న 27వ సినిమాని ప‌ర‌శురాంతో చేస్తాడ‌ని టాక్. ఇప్ప‌టికే క‌థ‌ని సిద్దం చేసుకున్న ప‌ర‌శురాం .. మ‌హేష్ ఓకే అంటే వెంట‌నే త‌న ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ట‌. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. డిసెంబర్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌నే టాక్స్ వినిపిస్తుండ‌గా, దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

1703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles