ఒకే ఫ్రేములో అల‌నాటి స్టార్ హీరోలు

Tue,July 2, 2019 10:37 AM
Director Kodanda Ramireddy Birthday Function Pics goes viral

అప్ప‌టి స్టార్ హీరో త్ర‌యం చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం చాలా అరుదు. సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ జ‌న్మ‌దిన వేడుక‌లో ఈ ముగ్గురు హీరోలు క‌లిసి కనిపించారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి . ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, దిల్‌ రాజు, అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, డాక్టర్ కేఎల్ నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు కోటి, కోదండ రామిరెడ్డి కుమారులు సునీల్‌, వైభ‌వ్ తదితరులు పాల్గొన్నారు. కోదండ రామి రెడ్డికి చిరంజీవి కేక్ తినిపించారు. కోదండరామి రెడ్డి అప్ప‌ట్లో చిరు, బాల‌య్య‌, వెంక‌టేష్‌తో ప‌లు హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.5892
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles