ఫ్యామిలీతో ఇస్మార్ట్ టైం

Sat,August 24, 2019 08:24 AM
Director Puri Jagannadh Family time

చాలా ఏళ్ళ త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ అనే మాస్ ఓరియెంటెడ్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన పూరీ జ‌గ‌న్నాథ్ త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌రకొండ‌తో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. 2020లో ఈ ప్రాజెక్ట్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే గ‌త కొద్ది రోజులుగా ఇస్మార్ట్ శంక‌ర్ ప‌నుల‌తో బిజీ బిజీగా ఉన్న పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యాడు. దీంతో ఆయ‌న‌ త‌న స‌తీమ‌ణి లావ‌ణ్య‌, కూతురు ప‌విత్రతో క‌లిసి స‌ర‌దా టైం స్పెంట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పూరీ జ‌గ‌న్నాథ్ త‌దుప‌రి ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇటీవ‌ల ఓ వార్త చ‌క్క‌ర్లు కొట్టింది. ఈ చిత్రానికి ఫైట‌ర్ అనే పేరుని ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది.

2379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles