'మల్లేశం' అభినందనీయుడు: రాఘవేంద్రరావు

Sat,June 29, 2019 02:56 PM
director raghavendra rao congratulate Mallesham movie team members

హైదరాబాద్‌: మల్లేశం చిత్ర బృందానికి దర్శకుడు రాఘవేంద్రరావు అభినందనలు తెలిపారు. ఫేస్‌బుక్‌ ద్వారా మల్లేశం చిత్ర బృందానికి, దర్శకుడు రాజ్‌కు అభినందనలు తెలిపారు. మంచి ప్రయత్నం చేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారన్నారు. మల్లేశం ఓ ప్రయోజనాత్మక చిత్రమని కొనియాడారు. మల్లేశం సినిమా ఎందరో చేనేత కార్మికుల కష్టాలకు ప్రతిబింబమన్నారు. తన వంతుగా నాలుగు ఆసు యంత్రాల తయారీకి రూ. లక్ష విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆసు యంత్రాన్ని కనిపెట్టి చింతకింది మల్లేశం కార్మికుల కష్టాలను తగ్గించారని ప్రశంసించారు. తన ప్రయత్నానికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం పొందిన మల్లేశం అభినందనీయుడని పేర్కొన్నారు.

2318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles