అక్టోబర్‌లో సెట్స్‌పైకి శేఖర్ కమ్ముల చిత్రం..!

Mon,August 19, 2019 05:08 PM
director shekar Kammula, chaitu movie to go floors in October

ఫిదా చిత్రం బాక్సాపీస్ వద్ద బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శేఖర్‌కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నాడు. శేఖర్‌కమ్ముల ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారట. తన ప్రతీ సినిమాలోను తెలంగాణ యాస, భాషకు ప్రాధాన్యమిస్తూ కీలకమైన పాత్రను పెడుతుంటారు శేఖర్ కమ్ముల. ఈ డైరెక్టర్ తాజా చిత్రంలో కూడా చైతూను తెలంగాణ యువకుడిగా చూపించనున్నట్లు టాక్. నాగచైతన్య ప్రస్తుతం మల్టీస్టారర్‌గా వస్తున్న వెంకీమామ చిత్రంలో నటిస్తున్నాడు. నాగచైతన్య, వెంకటేశ్, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.

1266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles