తేజ కావాలనే ఆ ప్రచారం చేయించాడట..!

Tue,July 9, 2019 08:55 PM
Director teja clarifies is he thrash actors in movie sets


చిత్రం, నువ్వునేను, జయం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ తేజ. సుదీర్ఘ విరామం తర్వాత రానాతో తీసిన నేనే రాజు నేనే మంత్రి మంచి హిట్ కొట్టడంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. నటీనటుల నుంచి తాను కోరుకుంటున్న యాక్టింగ్ స్టైల్ ను ఎలా రాబట్టుకోవాలో తేజకు బాగా తెలుసు. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు సీన్లు సరిగా రాకపోతే తేజ యాక్టర్లను కొడతారంటూ వార్తలు ఎన్నో సార్లు చక్కర్లు కొట్టాయి. ఇదే విషయమై ఇటీవలే జరిపిన చిట్ చాట్ లో స్పష్టత ఇచ్చాడు తేజ.

తొలినాళ్లలో నేను డైరెక్ట్ చేసిన సినిమాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాల ప్రభావంతో పదోతరగతి చదివేవిద్యార్థులు సినిమాల్లో నటిస్తామని నా దగ్గరికి వచ్చేవారు. నేను ఒక్క అవకాశం ఇస్తానేమోనని గంటల తరబడి ఎదురుచూసేవారు. కొందరైతే తమకు సినిమా అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని లెటర్స్ రాసేవారు. నేను చేసేదేమి లేక పోలీసులకు ఫిర్యాదు చేసేవాడిని. ఇలా చదువుకునేవాళ్లు సినిమాలంటూ సమయం వృధా చేసుకోకూడదనే ఉద్దేశంతో..నేను మూవీ సెట్స్ లో నటీనటులను కొడతానని కావాలనే ప్రచారం చేయించాను. ఇలాగైనా కనీసం నేను కొడతామోనని భయపడి రారని అనుకున్నా. అయితే ఆ నిర్ణయం కొంతవరకు మంచి ఫలితాన్నే ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.

3500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles