101వ సినిమాకు ఐదుగురు డైరెక్టర్లు వెయిటింగ్

Fri,February 10, 2017 10:13 AM

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రంగా శాతవాహన చక్రవర్తి జీవిత నేపథ్యంలో గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళు సాధించడంతో పాటు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అందించింది. ఇక తన 101వ చిత్రంగా బాలయ్య ఏ సినిమా చేయబోతున్నాడు అనే దానిపై అందరిలో సందేహం నెలకొంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఐదుగురు డైరెక్టర్లు క్యూలో ఉన్నారని తెలుస్తోంది. మొన్నటి వరకు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే చిత్రం చేయనున్నాడని ప్రచారం జరిగింది. ఇందులో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషించాల్సి ఉండగా, ఆయన డేట్స్ అడ్జెస్ట్ కాక ఈ ప్రాజెక్ట్ ని కొన్నాళ్ళు ప్రక్కన పెట్టినట్టు టాక్ .


ఇక ఇటీవల లింగా ఫేం కేఎస్ రవికుమార్.. బాలయ్యని కలిసి ఓ పవర్ ఫుల్ కథని వివరించడంతో ఆయనతో కలిసి చేసేందుకు బాలయ్య మొగ్గు చూపాడని రీసెంట్ గా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ 'సార్వభౌమ' పై దృష్టి పెట్టినట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. గతంలో బాలయ్యతో లయన్ సినిమా చేసిన సత్యదేవా ఓ పవర్ ఫుల్ కథని వినిపించగా ఆ కథకి ఇంప్రెస్ అయిన నటరత్న బాలయ్య ఈ ప్రాజెక్ట్ పై మక్కువ చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్టు ప్రకటించిన బాలయ్య ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇక మరో దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి కూడా ఈ 101వ చిత్రం తెరకెక్కించే రేసులో ఉన్నాడని ఫిలిం నగర్ టాక్. మరి ఫైనల్ గా బాలయ్య తన 101వ చిత్రాన్ని ఏ దర్శకుడితో కలిసి చేస్తాడో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.

2058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles