డిస్కోరాజా వాయిదా.. జ‌న‌వ‌రిలో రిలీజ్‌

Fri,November 8, 2019 08:13 AM

వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత ర‌వితేజ డిస్కోరాజా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేకర్స్ భావించిన‌ప్ప‌టికి, వీఎఫ్ఎక్స్ పూర్తి కాక‌పోవ‌డంతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 24న మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. వీఎఫ్ఎక్స్‌కి సంబంధించిన వ‌ర్క్ ఇంకా జ‌రుగుతుంది. తొంద‌ర‌ప‌డి సాదాసీదాగా ఉండే ఔట్‌పుట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాలేము. అందుకే సినిమాని త‌ప్ప‌క వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌న‌వ‌రి 24న మీకు డిస్కోరాజాతో మంచి వినోదాన్ని క‌లిగిస్తాము అని నిర్మాత‌లు పేర్కొన్నారు. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వీఐ ఆనంద్ తెర‌కెక్కిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles