ర‌వితేజ చిత్రం ఆగిపోలేదు.. మే 27 నుండి రెండో షెడ్యూల్

Tue,May 7, 2019 08:42 AM

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. పలు కార‌ణాల వ‌ల‌న చిత్ర షూటింగ్ ఆగిపోయింద‌ని, ఈ క్ర‌మంలో ర‌వితేజ విదేశీ యాత్ర‌కి వెళ్ళాడంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఈ వార్తల్ని నిర్మాత రామ్ తాళ్లూరి, ద‌ర్శకుడు విఐ ఆనంద్ ఖండించారు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ మే 27 నుంచి హైదరాబాద్‌లో జ‌రుపుకోనుంద‌ని వెల్లడించారు. ఈ షెడ్యూల్‌లో హీరో రవితేజతో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారని వారు తెలియ‌జేశారు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో RX 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో కూడిన స‌న్నివేశాలు కీల‌కం కాబ‌ట్టి వాటికోసం టీం రెండో షెడ్యూల్‌కి ఎక్కువ స‌మ‌యం తీసుకుంద‌ట‌. సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిషోర్ త‌దితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

1012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles