మార్చి 5 నుండి డిస్కోరాజా సంద‌డి

Sun,March 3, 2019 07:09 AM
disco raja shooting starts from march 5

ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ డిస్కోరాజా అనే చిత్రం చేసేందుకు సిద్ధ‌మయిన సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్ లోగో విడుద‌ల చేశారు. లోగో పోస్ట‌ర్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. డిసెంబ‌ర్ లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం వాయిదా ప‌డింద‌ని అన్నారు. చిత్ర క‌థ సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ బేబీ సినిమా కథను పోలి ఉండటంతో కథలో మార్పులు చేసిన తరువాత షూటింగ్‌ను ప్రారంభించాల‌ని ర‌వితేజ చెప్ప‌డంతో మూవీ చిత్రీక‌ర‌ణకి మ‌రింత టైం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 5న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలుస్తుంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుండ‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మూడో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది.

1717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles