డిస్కో రాజా రిలీజ్ డేట్ ఫిక్స్

Thu,August 29, 2019 11:45 AM

వ‌రుస ప‌రాజయాల త‌ర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ర‌వితేజ ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ సెప్టెంబ‌ర్ 2న వినాయ‌క చవితి సంద‌ర్భంగా రివీల్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. చిత్రాన్నిడిసెంబర్ 20,2019న‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు కొద్ది సేప‌టి క్రితం ప్ర‌కటించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌డం ఖాయ‌మ‌ని వారు పేర్కొన్నారు . ఇటీవ‌ల ర‌వితేజ యంగ్ లుక్ అంటూ ఓ ఫోటో చ‌క్క‌ర్లు కొట్ట‌గా, అది సినిమాకి సంబంధించిన లుక్ కాద‌ని ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చాడు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా న‌టిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త.

1045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles