ప్ర‌భుదేవ కొరియోగ్ర‌ఫీ.. గాయ‌ప‌డ్డ దిశా ప‌టానీ

Sat,November 9, 2019 12:20 PM

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన భార‌త్ సినిమా త‌ర్వాత దిశా ప‌ఠానీ రేంజ్ మారింది. ప్ర‌స్తుతం ఆమె టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉంది. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు మోహిత్ సూరీ తెర‌కెక్కించిన మ‌లంగ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆదిత్య‌రాయ్ క‌పూర్, అనీల్ క‌పూర్, కునాల్ కెమ్ము ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇక ప్ర‌స్తుతం ప్రభుదేవా- స‌ల్మాన్ ఖాన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న రాధే చిత్రంలో న‌టిస్తుంది దిశా. అయితే రెండో షెడ్యూల్ ప్రారంభానికి ముందు దిశా ప‌టానీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఈ క్ర‌మంలో త‌న మోకాళ్ళ‌ని గాయ‌ప‌ర్చుకుంది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో గాయ‌ప‌డిన మోకాళ్ళ‌ని చూపిస్తూ.. ప్ర‌భుదేవ పాట షూటింగ్ అంటే ఇలానే ఉంటుంది అని కామెంట్ పెట్టింది. మ‌రి ఇండియ‌న్ మైకెల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీ అంటే ఈ రేంజ్‌లోనే ఉంటుంద‌ని ప‌లువురు నెటిజ‌న్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

1357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles