ర‌ణవీర్ గెటప్‌లో ట్రంప్.. వైర‌ల్ అవుతున్న వీడియో

Wed,February 27, 2019 01:20 PM

టెక్నాల‌జీ స‌రికొత్త పుంత‌లు తొక్కుతుండ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇవి నెటిజ‌న్స్‌కి ఫుల్ ఫ‌న్ జ‌న‌రేట్ చేస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్ఫింగ్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాజీరావు మ‌స్తానీ చిత్రంలో పేశ్యా యోదుడు బాజీరావ్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ క‌నిపించ‌గా, ఆయ‌న మ‌ల్హ‌రి అనే పాట‌లో త‌న సైన్యంతో క‌లిసి గంతులేశాడు. ఈ పాట అప్ప‌ట్లో అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. అయితే ఇప్ప‌డు ఈ పాట వీడియోలో ర‌ణ‌వీర్ సింగ్ ముఖం స్థానంలో ట్రంప్ ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. పెశ్వా వారియ‌ర్ ట్రంప్ అనే పేరుతో ఈ వీడియో షేర్ అవుతుండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు 3.5 ల‌క్ష‌ల మంది వీడియోని చూశారు. 2000 మంది రీ ట్వీట్ చేశారు.





Original Video

2647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles