మే 19 వరకు ఆ సినిమాను విడుదల చేయొద్దు..

Thu,April 25, 2019 03:01 PM
Dont release PM Narendra Modi movie before May 19 EC to Supreme Court


వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న పీఎం నరేంద్రమోదీ బయోపిక్‌ను మే 19వరకు విడుదల చేయొద్దని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సూచించింది. ఈ చిత్రం బయోపిక్ కన్నా ముందు..మహాత్ముల జీవితచరిత్ర. ఇలాంటి చిత్రం బీజేపీ పార్టీకి ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి చేకూరే అంశమని ఈసీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో చివరి విడత లోక్‌సభ ఎన్నికల ముగిసే వరకు పీఎం నరేంద్రమోదీ చిత్రం విడుదల చేయవద్దని కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈసీ పేర్కొంది.

పీఎం నరేంద్రమోదీ చిత్ర ట్రైలర్ విడుదలైన తర్వాత..ఈ సినిమా బీజేపీకి ప్రయోజనం కలిగించే విధంగా ఉందని, ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే..జనాలపై ప్రభావాన్ని చూపించే అవకాశమున్నందున విడుదల ఆపేయాలని పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

1508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles