విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడి మూవీ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్

Wed,May 22, 2019 01:22 PM
Dorasaani  movie release date fixed

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తుంటే ఇప్పుడు ఆయ‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని పంచేందుకు సిద్ద‌మ‌య్యాడు. దొర‌సాని అనే చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం కానున్న ఆనంద్ త‌న డెబ్యూ చిత్రాన్ని జూలై 5న థియేట‌ర్స్‌లోకి తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ట‌. తెలంగాణ నేప‌థ్యంలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఆర్ మ‌హేంద్ర తెర‌కెక్కిస్తున్నారు. ఈయ‌నకి కూడా ఈ చిత్రం డెబ్యూ మూవీ కానుంది. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సురేష్‌ బాబు సమర్పణలో పెళ్లి చూపులు కో ప్రొడ్యూసర్ యష్ రంగినేని - మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌రో నెల‌లోనే సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో చిత్రానికి వినూత్నంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌ర‌పాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజ‌శేఖ‌ర్ కూడా దొర‌సాని మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగం అవుతార‌ని తెలుస్తుంది. ఏదేమైన కొత్త ద‌ర్శ‌కుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ ముగ్గురు కొత్త వాళ్ళ‌తో రూపొంద‌నున్న ఈ సినిమా ఎంత విజ‌యం సాధిస్తుందో చూడాలి.

3037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles