నెల రోజుల్లో రూ.140 కోట్లు వసూలు

Mon,October 14, 2019 04:29 PM


బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం డ్రీమ్ గర్ల్. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సెప్టెంబర్ 13న విడుదలైన డ్రీమ్ గర్ల్ మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీ నెల రోజుల్లో రూ.140 కోట్లు వసూలు చేసి ఆయుష్మాన్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. గతేడాది ఆయుష్మాన్ నటించిన బఢాయి హో చిత్రం రూ.138 కోట్లు వసూలు చేయగా..తాజాగా ఈ కలెక్షన్లను డ్రీమ్ గర్ల్ సినిమా కేవలం నెల వ్యవధిలోనే అధిగమించింది. రాజ్ శాండిల్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నుష్రత్ బరూచా ఆయుష్మాన్ కు జోడీగా నటించగా..అన్నూ కపూర్ కీలకపాత్రలో కనిపించాడు.2561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles