తండ్రయిన సందర్భంగా ఆ హీరోకి విషెస్ చెప్పిన సమంత

Sun,May 7, 2017 06:51 AM

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, అమల్ సుఫియా దంపతులకు శుక్రవారం నాడు పండంటి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని దుల్కర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ సందర్భంగా అటు అభిమానులు, ఇటు సినీ సెలబ్రిటీస్ దుల్కర్ ని అభినందించారు. శుక్రవారం నాడు మీ ఇంట మహాలక్ష్మీ అడుగు పెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక రానా,విక్రమ్ ప్రభు, సమంతలు కూడా దుల్కర్ కి విషెస్ తెలియజేశారు. అయితే సమంత ట్వీట్ కి బదులిచ్చిన దుల్కర్ , ధన్యవాదాలు సామ్‌! చై కూడా మెసేజ్‌ పెట్టాడు. మా ప్రేమ మీ ఇద్దరికి ఉంటుంది’ అని ట్వీట్‌ చేశాడు. ఇక స్టార్ హీరో మమ్ముట్టి తనయుడైన దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. ‘ఓకే బంగారం’, ‘100 డేస్‌ ఆఫ్‌ లవ్‌’ వంటి చిత్రాలతో ఆడియన్స్ ని ఎంతగానో అలరించాడు. దుల్కర్ నటించిన కామ్రేడ్ ఇన్ అమెరికా చిత్రం రీసెంట్ గా విడుదలై మంచి విజయం సాధించింది.






1773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles