తండ్రి కాబోతున్న స్మార్ట్ హీరో ..!

Tue,April 4, 2017 02:18 PM

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోను ఈ హీరో సుపరిచితం. దుల్కర్ నటించిన పలు మలయాళ మూవీస్ తెలుగులోకి డబ్ కాగా, ఆ సినిమాలు ఆడియన్స్ ని ఎంతగానో అలరించాయి. అయితే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తండ్రి కాబోతున్నాడనే విషయం మల్లూవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దుల్కర్ కజిన్ మగ్బూల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో ఈ స్మార్ట్ హీరో వైఫ్ అమల్ సూఫియా బేబి బంప్ తో కనిపించడం అందరిలో అనుమానాలు కలిగించింది. దుల్కర్ సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రస్తుతం అమల్ ప్రగ్నెన్సీతోనే ఉందని టాక్. మే చివరి వారంలో లేదంటే జూన్ ఫస్ట్ వీక్ లో దుల్కర్, అమల్ దంపతులకు పండంటి బిడ్డ జన్మించనుందని చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. దుల్కర్ సల్మాన్, అమల్ ల వివాహం 2011లో జరిగిన సంగతి తెలిసిందే.

5159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles