ఏప్రిల్ లో ముగ్గురు హీరోల మధ్య బిగ్ ఫైట్

Tue,March 7, 2017 11:04 AM

సమ్మర్ లో స్కూల్స్ కి సెలవులు ఉండడంతో చిత్ర నిర్మాతలు ఇదే అదునుగా భావించి వరుస సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లలోను సమ్మర్ సందడి జోరుగా ఉండనుంది. టాలీవుడ్ లో బాహుబలి, కాటమరాయుడు, పవన్ సినిమాతో పాటు మరి కొన్ని బడా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. ఇక మాలీవుడ్ ప్రామిసింగ్ హీరోస్ దుల్కర్ సల్మాన్, ఫాహద్ ఫాజిల్ మరియు నివీన్ పాలీ ల మధ్య బడా ఫైట్ నెలకొంది. ఏప్రిల్ లో ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటి పడేందుకు సిద్దమైనట్టు సమాచారం.


దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీఐఏ ( కామ్రెడ్ ఇన్ అమెరికా), ఫర్హాద్ నటించిన రోల్ మోడల్స్ , నివీన్ నటించిన శకువు చిత్రాలు ఏప్రిల్ లో బాక్సాఫీస్ హిట్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ సినిమాల రిలీజ్ డేట్స్ పై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది. అయితే ఈ ముగ్గురు హీరోలు కొన్నాళ్ళుగా అభిమానులను ఊరిస్తూ వస్తున్నారు. నివీన్ మరియు ఫాహద్ చిత్రాలు 2016 మిడాఫ్ నుండి విడుదల కాకపోవడంతో వారి సినిమాలపై చాలా ఆసక్తి నెలకొంది. ఇక దుల్కర్ కి 2017లో సీఐఏ రెండవ చిత్రం కానుంది. సీఐపే చిత్రం మరియు శకువు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందగా, రోల్ మోడల్ పూర్తి ఫన్ ఎంటర్ టైనర్ గా ఉండనుందని చెబుతున్నారు. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి.

2138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles