త‌మిళంలో అర్జున్ రెడ్డిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Sat,February 2, 2019 10:44 AM
Dwaraka Telugu Movie as arjun reddy

యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కేవ‌లం తెలుగులోనే కాక ప‌లు భాష‌ల‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.ఈ నేప‌థ్యంలో ఆయ‌న తెలుగు చిత్రాల‌ని వేరే భాష‌ల‌లో డ‌బ్ చేసి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్‌. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వంలో విజ‌య్ దేవ‌రకొండ‌, పూజా జ‌వేరి ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం ద్వార‌క‌. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ బ్యానరుపై ఏఎన్‌ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి టైటిల్ బాగా పాపుల‌ర్ కావ‌డంతో ఈ పేరుతో ద్వార‌క డ‌బ్బింగ్ వ‌ర్షెన్‌ని త‌మిళంలో విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం తెలిపింది. ప్రేమ, యాక్షన్‌, కమర్షియల్‌ వంటి అంశాలన్నీ కలగలిసిన సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక‌ని త్వ‌ర‌లోనే నిర్వ‌హించి ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌ని ముఖ్య అతిధిలుగా ఆహ్వానించ‌నున్న‌ట్టు వారు తెలిపారు. ద్వారాక చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, ప్రభాకర్‌, మురళీ శర్మ, సురేఖలు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించారు. సాయికార్తిక్‌ సంగీతం సమకూర్చారు.

3480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles