కీల‌క స‌న్నివేశాల‌ని సోష‌ల్ మీడియాలో లీక్ చేయోద్దు

Fri,August 16, 2019 11:06 AM

స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో విడుద‌లైన ఎవ‌రు చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం సాధించింది. క్షణం, గూఢచారి వంటి అభిరుచి గల కథాంశాల్నిఎంచుకొని చక్కటి విజయాల్ని అందుకున్న‌ అడవి శేష్ మ‌రోసారి థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. చిత్రంలో కావాల్సినంత ఉత్కంఠతో పాటు కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో అబద్దాలు ఎవరిని దోషిగా తేల్చాయన్నది ఆకట్టుకునే అంశంగా మిగిలిపోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌గా, కొంద‌రు ఔత్సాహికులు కీల‌క స‌న్నివేశాల‌ని ఫోటోలు లేదా వీడియోల రూపంలో సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల‌న సినిమా చూడ‌ని ప్రేక్ష‌కుడికి అది వేరేలా వెళుతుంది. ద‌య‌చేసి సినిమాకి సంబంధించి ఎలాంటివి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయోద్ద‌ని అడివి శేష్‌, నవీన్‌ చంద్ర, రెజీనాలు రిక్వెస్ట్ చేశారు. అంతేకాక త‌మ‌కి ఇంత‌టి ఘనవిజయాన్ని అందించిన అభిమానుకుల కృతజ్ఞతలు తెలియజేశారు.



1068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles