పెళ్లి చూపులు ద‌ర్శ‌కుడు రెండో చిత్రం మోష‌న్ పోస్ట‌ర్

Sat,June 2, 2018 11:44 AM

విజయ్‌దేవరకొండ, రీతూ వర్మ కాంబినేషన్‌లో త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం ‘పెళ్లిచూపులు’ . ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్‌ హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖుల ప్రశంసలు లభించగా, నేషనల్ అవార్డు కూడా ద‌క్కింది. పలు భాషలలో ఈ చిత్రం రీమేక్ అయ్యేందుకు కూడా రెడీ అవుతుంది. అయితే పెళ్ళి చూపులు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన తరుణ్ భాస్కర్ త్వ‌ర‌లో మ‌రో మూవీతో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ న‌గ‌రానికి ఏమైంది అనే టైటిల్‌తో చిత్రం తెర‌కెక్కుతుంది.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై సురేష్ బాబు ఈ న‌గ‌రానికి ఏమైంది అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన టీం ఇందులో న‌లుగురు కుర్రాళ్ళ‌ని టాప్ యాంగిల్ నుండి చూపించారు. నీ గ్యాంగ్‌తో రా థియేట‌ర్‌కి, చూస్కుందాం అనే క్యాప్ష‌న్ కూడా పోస్ట‌ర్‌లో క‌నిపించింది. సినిమా తీయాల‌నే త‌ప‌న‌తో న‌లుగురు కుర్రాళ్ళు ప‌డే వేద‌న‌ని సినిమా ద్వారా ద‌ర్శ‌కుడు చూపించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్‌ని స‌మంత‌, నాగ చైత‌న్య త‌మ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఇది మా మ‌న‌సుకు నచ్చింద‌నే కామెంట్ కూడా పెట్టారు. మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేశాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్‌. వివేక్ సాగ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.2289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles