HomeLATEST NEWSEe Nagaraniki Emaindi trailer unveiled

తరుణ్‌భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది ?’ ట్రైలర్

Published: Sun,June 10, 2018 02:55 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

పెళ్లి చూపులు ఫేం తరుణ్‌భాస్కర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. కొత్త కాన్సెప్ట్‌తో పెళ్లి చూపులు తీసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు తరుణ్‌భాస్కర్. ఈ యువ దర్శకుడు మరోసారి యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు. తరుణ్‌భాస్కర్ రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది ? ట్రైలర్‌ను నటుడు రానా విడుదల చేశాడు.

షార్ట్ ఫిలిం తీయాలనుకునే నలుగురు యువకుల (స్నేహితులు)చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్, వెంకటేశ్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిసున్నాడు. తరుణ్ నయా సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.

3220
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology