ఖుష్బూ కారుపై కోడిగుడ్ల‌తో దాడి

Thu,March 1, 2018 09:45 AM

ప్రముఖ న‌టి, సుంద‌ర్ సి భార్య ఖుష్బూపై గుర్తు తెలియని వ్య‌క్తులు కొంద‌రు కోడిగుడ్లు, టమాటాల‌తో దాడి చేయ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. 2015లో స్త్రీల మానం గురించి చేసిన వ్యాఖ్య‌ల‌కి సంబంధించి బుధ‌వారం మేటూర్ కోర్టుకి హాజ‌రైంది ఖుష్బూ. కేసు విచార‌ణ‌కి హాజ‌రు అవుతున్న క్ర‌మంలో ఆమెపై ఈ దాడి జ‌రిగింది. ఈ చర్యలను ఖండిస్తూ మేటూర్‌ తహసీల్దారు ఫిరోజ్‌ఖాన్‌ పాట్లాలిమక్కల్‌ కట్చికి చెందిన 41మందిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు .అయితే ఖుష్బూ చేసిన కామెంట్స్ అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నం సృష్టించాయి. సేలంకి చెందిన పాట్టాలి మ‌క్క‌ల్ క‌ట్చి త‌ర‌పు న్యాయ‌వాది మురుగన్ మేటూర్ కోర్టులో ఖుష్బూ పై పిటీష‌న్ వేయడంతో ఈ కేసు ఇప్పుడు విచార‌ణ‌కి వ‌చ్చింది. విచార‌ణ స‌మ‌యంలో మెజిస్ట్రేట్ ఖుష్బూని కొన్ని ప్ర‌శ్న‌లు వేసి, ఆమె స‌మాధానాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మార్చి 6న దీనిపై మ‌రో విచార‌ణ జ‌ర‌ప‌నున్నారు.ఖుష్బూ రీసెంట్‌గా అజ్ఞాత‌వాసి అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

2465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles