'ఎగిరెనే మ‌న‌సు' మేకింగ్ వీడియో విడుద‌ల‌

Sat,August 11, 2018 11:32 AM
Egireney Manasu Making Video from Nartanasala

ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన కుర్ర హీరో నాగ‌శౌర్య‌. ఇటీవ‌ల‌ ఛ‌లో అనే సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ హీరోకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ప్ర‌స్తుతం ఈ హీరో చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా న‌ర్త‌న‌శాల అనే చిత్రం చేస్తున్న నాగ శౌర్య ఇటీవ‌ల‌ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ ఆద్యంతం వినోదభ‌రితంగా ఉంది. డైలాగ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. సినిమాపై ఆస‌క్తి పెరిగింది. ఈ మూవీకి మహతి స్వర సాగర్‌ అందించగా.. కష్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై శంకర్‌ మూల్పూరి, ఉషా మూల్పూరి నిర్మించగా.. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఎగిరెనే మ‌న‌సు అనే మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. కొరియోగ్రాఫ‌ర్‌, లిరిసిస్ట్ తో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌దిత‌రులు సాంగ్‌కి సంబంధించిన అనుభ‌వాలు వివ‌రించారు. మ‌రి మేకింగ్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.


1577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles