ఎనిమిది పాట‌ల‌తో ఆర్ఆర్ఆర్ చిత్రం..!

Thu,November 7, 2019 09:52 AM

ల‌వ్ స్టోరీతో రూపొందే చిత్రాల‌లోనే మూడు నుండి నాలుగు పాటలు ఉంటున్నాయి. అలాంటిది ఓ చారిత్రాత్మ‌క చిత్రం ఎనిమిది పాట‌ల‌తో రూపొందుతుంది అంటే విన‌డానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది. కాని ఇది నిజం అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసి మూవీని జూలైలో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.


తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త బయ‌ట‌కి వ‌చ్చింది. ఇందులో ఉత్కంఠ రేపే స‌న్నివేశాల‌తో పాటు అల‌రించే పాట‌లు ఎనిమిది ఉంటాయ‌ట‌. ఆ పాట‌లు దేశ‌భక్తిని పెంచే పేట్రియాటిక్ సాంగ్స్ అని కొంద‌రు చెబుతుండ‌గా, వాటితో పాటు హీరో హీరోయిన్స్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉంటాయ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. సుద్దాల అశోక్ తేజ స్వాతంత్య్ర‌కాంక్ష‌ని పెంచే మూడు సాంగ్స్ రాస్తున్నార‌ని తెలుస్తుండ‌గా, మిగ‌తా పాటలు ప్ర‌ముఖ లిరిసిస్ట్స్ రాస్తున్న‌ట్టు టాక్. కీరవాణి చిత్రానికి సంగీతం అందిస్తున్న విష‌యం తెలిసిందే . బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్ మ‌రోసారి తెలుగు సినిమా కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ని విశ్వ‌వ్యాప్తం చేస్తుంద‌ని అభిమానులు చెబుత‌న్నారు.

1670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles