ఎల్లువొచ్చి గోదార‌మ్మ సాంగ్‌కి థియేట‌ర్‌లో అదిరిపోయే రెస్పాన్స్

Sun,September 22, 2019 10:16 AM

శోభ‌న్ బాబు, శ్రీదేవి, జ‌య‌ప్ర‌ద ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం దేవ‌త‌. ఇందులో శ్రీదేవి, శోభ‌న్ బాబు మ‌ధ్య వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ అనే సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందే ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఇందులో బిందెల మ‌ధ్య వీరిద్ద‌రు నృత్యం చేయ‌డం అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తాజాగా ఇదే సాంగ్‌ని సేమ్ స్టైల్‌లో రీమేక్ చేసారు హరీష్ శంక‌ర్. వ‌రుణ్ తేజ్‌, పూజా హెగ్డేల మ‌ధ్య ఎల్లువొచ్చి గోదార‌మ్మ రీమేక్ సాంగ్ చిత్రీక‌రించగా, ఈ సాంగ్‌కి థియేట‌ర్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. సీట్ల‌లో నుండి లేచి మ‌రీ ఆడియ‌న్స్ స్టెప్పులేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోని పూజా హెగ్డే త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇందుకే నేను చేయాల్సిందాని కోసం మైళ్ళు వెళుతుంటాను. ఇవ‌న్నీ చూస్తే చింత‌ల‌న్నీ మ‌రిచిపోతాం. ఆనందించడం, థియేటర్లలో ఇలా నృత్యం చేయడం, నిద్రలేని రాత్రులు, ప్రయాణం, ఎండలో నిలబ‌డి సినిమాలు చేయ‌డం మీ ప్రేమ ముందు మ‌రిచిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ ల‌వ్ యూ అంటూ కామెంట్ కూడా పెట్టింది పూజా. ప్ర‌స్తుతం గ‌ద్ధ‌ల కొండ గ‌ణేష్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతుంది.
3148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles