'జాన్' కోసం ఆర్ఎఫ్‌సీలో యూర‌ప్ సెట్‌

Fri,November 15, 2019 08:09 AM

సాహో చిత్రం త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ..రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 18న నుండి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుపుకోనుంది. జాన్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని దాదాపు 180 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. సినిమా కోసం 80ల కాలం నాటి యూర‌ప్ సెట్‌ని ఆర్ఎఫ్‌సీలో రూపొందిస్తున్నార‌ట‌.చిత్ర నిర్మాణ సంస్థ 25 విలాసవంతమైన సెట్లను ఏర్పాటు చేయ‌నుండ‌గా, కొన్ని సన్నివేశాలను మినహాయించి మొత్తం షూట్ ఈ సెట్లలో పూర్తవుతుందని ఇన్‌సైడ్ టాక్. పూజా హెగ్డే క‌థానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles