సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘ఎవరు’ ట్రైలర్‌ విడుదల

Mon,August 5, 2019 03:02 PM

`క్షణం`, `గూఢచారి` వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అడివి శేష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `ఎవరు`. పీవీపీ సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరు, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నేలు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉత్కంఠగా సాగే క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. రెజీనా పోషించిన పాత్ర చుట్టూనే ఈ సినిమా సాగుతుందని స్పష్టమవుతోంది. ‘ఎవరు’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాతలు తెలిపారు.


793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles