రీఎంట్రీ ఇచ్చిన ఎక్స్‌ హౌజ్‌మేట్స్‌.. ఇంట్లో సంద‌డి వాతావ‌ర‌ణం

Sat,November 2, 2019 07:44 AM

నాగార్జున హోస్ట్‌గా ప్రారంభ‌మైన బిగ్ బాస్ సీజ‌న్ 3 రేప‌టితో ముగియ‌నుంది. ఈ సంద‌ర్భంగా బిగ్ బాస్ హౌజ్‌లో వారం రోజులుగా సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది. ఎలాంటి టాస్క్‌లు లేకుండా కేవ‌లం వినోదాత్మ‌కంగా బిగ్ బాస్ సీజ‌న్ 3 చివ‌రి వారం న‌డుస్తుంది. ఎపిసోడ్ 104లో ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్లిన స‌భ్యులు తిరిగి లోప‌లికి వ‌చ్చారు. టాప్ 5 కంటెస్టెంట్స్‌తో క‌లిసి సంద‌డి చేశారు.


మొద‌ట రవి ఇంట్లోకి అడుగుపెట్ట‌గా ఆ త‌ర్వాత జాఫ‌ర్ వ‌చ్చారు. జాఫ‌ర్ రాక‌తో బాబా భాస్క‌ర్‌ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇద్ద‌రు చిన్న‌పిల్లల్లా ఆనంద‌క్ష‌ణాలు గ‌డిపారు. ఇక అషు రెడ్డి, రోహిణి వీళ్లిద్దరూ క‌లిసి క‌ట్టుగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంద‌రిని ప‌ల‌క‌రిస్తూ పాత రోజులు గుర్తు చేసుకున్నారు. ఇంత‌లో తమన్నా సింహాద్రి హాట్ డ్రెస్‌లో స్పెష‌ల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో ఇంట్లో కొత్త సంద‌డి నెల‌కొంది. మ‌ధ్యాహ్నాం స‌మ‌యంలో పునర్న‌వి, వితికా క‌లిసి ఎంట్రీ ఇచ్చారు. భ‌ర్త‌ని చూసిన ఆనందంలో వితికా ఉంటే, చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్ళీ రాహుల్‌ని క‌ల‌వ‌డం పున‌ర్న‌వికి చాలా సంతోషాన్ని క‌లిగించింది

భ‌ర్త‌ని కోర్డ్ యార్డ్‌లోకి తీసుకెళ్లి బ‌య‌ట ముచ్చ‌ట్లు చెబుతూ గోరు ముద్ద‌లు తినిపించింది వితికా. త‌న భార్య చెప్పే ముచ్చ‌ట్లు వింటూ సంతోషంగా మ‌ధ్యాహ్నా భోజ‌నం పూర్తి చేశాడు వ‌రుణ్‌. కొద్ది సేప‌టి త‌ర్వాత శిల్పా చక్రవర్తి, శివజ్యోతి, మహేష్ విట్టా హౌస్‌లోకి వచ్చారు. వీళ్ల ముగ్గిరికీ ఆత్మీయ స్వాగతం పలికారు. అయితే, మహేష్ చెప్పినట్టుగా తాను ఫైనల్‌కు వెళ్లానని.. అందుకని టిక్కెట్ టు ఫినాలేను మహేష్‌కి ఇస్తున్నానని చెబుతూ టికెట్ టూ ఫినాలే షీల్డ్‌ను బాబా భాస్కర్‌.. మహేష్‌కి ఇచ్చారు.

ఇక చివ‌రిగా హేమ, హిమజ ఇంట్లోకి అడుగుపెట్టారు. అక్క నువ్వు తోపు అని హేమ‌ని ఆట‌ప‌ట్టించారు. హిమ‌జ‌నేమో బాబీ డాల్‌లా రెడీ అయి వ‌చ్చింద‌ని పంచ్‌లు వేశారు. మొత్తానికి బ‌య‌ట‌కి వెళ్ళిన హౌజ్‌మేట్స్ అంద‌రు మ‌ళ్ళీ తిరిగి రావ‌డంతో హౌజ్ క‌ళ‌క‌ళ‌లాడింది. వీరంద‌రికి బిగ్ బాస్ ఏవీ చూపించారు. పాత జ్ఞాప‌కాల‌న్నింటిని నెమ‌రువేసుకున్నారు. ఏవీ చూసిన త‌ర్వాత త‌మ‌న్నా ఎమోష‌న‌ల్ అయి ర‌వికృష్ణ‌కి సారీ చెప్పింది. నేను నీతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాను. ఇది నా గేమ్ స్ట్రాట‌జీ అని చెప్పింది. అంద‌రి ముందు క్ష‌మాప‌ణ‌లు చెప్పినందుకు ర‌వి కూడా హ్యాపీగా ఫీల‌య్యాడు.

కొద్ది సేప‌టి త‌ర్వాత‌ ఇంట్లో ఉన్న అందరికీ బిగ్ బాస్ ఒక్కో పత్రాన్ని అందజేశారు. రాత్రి జరిగే అవార్డుల ఫంక్షన్‌కు సంబంధించి ఆ పత్రాల్లో ప్రతి సభ్యుడు ఎవరికీ తెలియకుండా నింపాలని సూచించారు. అనంతరం ఆ పత్రాలను స్టోర్ రూంలో పెట్టేయాలి అన్నారు. ఇక జాఫ‌ర్ హోస్ట్‌గా నైట్ పార్టీ మొద‌లైంది. అంత‌లోనే 104వ ఎపిసోడ్‌కి బ్రేక్ ప‌డింది. ఈ రోజు పార్టీ హంగామా ఉండ‌నుండ‌గా, నాగ్ రేప‌టి ఎపిసోడ్‌లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

2991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles