చిరు 152వ ప్రాజెక్ట్‌పై తాజా అప్డేట్‌

Sat,October 5, 2019 09:34 AM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న చిరు త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు 152వ చిత్రం తెర‌కెక్క‌నుండగా, ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ మొద‌టి వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నార‌ట‌. రామోజీ ఫిలిం సిటీలో చిత్రం కోసం ప్ర‌త్యేక సెట్ కూడా రూపొందించిన‌ట్టు సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తాన్ని ఈ సెట్‌లోనే చిత్రీక‌రించనున్న‌ట్టు తెలుస్తుంది. రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది. కమర్షియల్ అంశాలతో కూడిన సోషల్ కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు.

3558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles